మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథా చిత్రాలను తెరపైకెక్కిస్తూ వస్తున్నాడు. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను మాత్రమే కాదు, భారీ బడ్జెట్ సినిమాలను కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇక హారర్ జోనర్ ను టచ్ చేస్తూ ‘జాంబి రెడ్డి’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. కథాకథనాల పరంగా ఈ సారి ఆయన మరో ప్రయోగానికి సిద్ధమాయ్యారు.
‘హనుమాన్’ అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా పనులతో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ‘అంజనాద్రి’పై ఉన్న హనుమంతుడిని ఈ నెల 18వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు కలుసుకోమని చెప్పి ఒక పోస్టర్ ను వదిలాడు. ఆ సమయంలో ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నామని ఆయన ఇలా చెప్పి ఉండొచ్చు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది.
Dive into the world of Anjanadri!🏔Introducing #Hanumanthu from 𝐇𝐀𝐍𝐔🔶𝐌𝐀𝐍
⏰18th September, Saturday @ 10.08AM
A @PrasanthVarma Film!🎬@tejasajja123@niran_reddy @Primeshowtweets @chaitanyaniran @asrinreddy @ursvamsishekar#HanuMan #HanuManTheOrigin #SuperHeroHanuMan pic.twitter.com/jeAiHOlXd4
— Prasanth Varma (@PrasanthVarma) September 16, 2021