స్టార్ డమ్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానుల అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కర్ణన్’.. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వాలైంటైన్స్ డే రోజున ‘కర్ణన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒంటిపై గాయాలు, చేతులకు సంకెళ్లతో తీక్షణంగా చూస్తున్న ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. మరోసారి వైవిధ్యమైన పాత్రలో అలరించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. ఏప్రిల్ 9న ‘కర్ణన్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
#Karnan first look and “THEATRICAL RELEASE”date !! pic.twitter.com/N5gx88XgWr
— Dhanush (@dhanushkraja) February 14, 2021