ధనుశ్ చేసిన మరో సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున ధనుశ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాకి ‘మారన్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుశ్ యాక్షన్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
‘అతని ధైర్యమే అతని ఆయుధం’ అంటూ ధనుశ్ పాత్రను గురించి కార్తీక్ నరేన్ హింట్ ఇచ్చాడు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 43వ సినిమా. అర్జున్ – త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.