శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలను వెండితెరకు పరిచయం చేశారు. తన దర్శకత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సూపర్ స్టార్ యాక్టర్స్ పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన పెళ్లి సందడి చిత్రంతో నటుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో వశిష్ట అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘పెళ్లి సందడి’ పేరుతో రోషన్, శ్రీలీల జంటగా చిత్రం రూపొందుతుండగా, ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, హేమ, ఝాన్సీ తదితరలు కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రంకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.కొద్ది రోజుల క్రితం మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించిన మేకర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కు టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్లని చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానిస్తున్నారు. ఈ వేడుక అక్టోబర్ 10 సాయంత్రం 6గం.ల నుండి మొదలు కానుంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి పక్కా ఫామిలీ ఎంటర్టైనర్ గా పెళ్లి సందడి తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. పెళ్లి సందడి చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ,హీరోగా రోషన్ కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం.