ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న ‘స్టేట్ రౌడీ’ అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. సందీప్ కిషన్ జోడీగా నేహా శెట్టి పరిచయమవుతోంది.
యాక్షన్ కామెడీ సినిమాలు చేయడంలో జి. నాగేశ్వరరెడ్డి సిద్ధహస్తుడు. గతంలో ఆయన సందీప్ తో చేసిన ‘తెనాలి రామకృష్ణ బీఎబీఎల్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి. రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్ … పోసాని కృష్ణమురళి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.