తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా ‘చతుర్ ముఖం’ సినిమా పలకరించనుంది .. ఇది కూడా మలయాళ సినిమాకి తెలుగు అనువాదమే. మంజు వారియర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి యూ ట్యూబ్ వేదికగా ట్రైలర్ ను వదిలారు. ఆధునిక ఆలోచనలు .. స్వతంత్ర భావాలు కలిగిన ఒక యువతి, తన కాళ్లపై నిలబడి తన కలలను నిజం చేసుకుంటూ ఉంటుంది. మూఢనమ్మకాలకు ఆమె చాలా దూరం. అలాంటి ఆ యువతి జీవితంలో హఠాత్తుగా కొన్ని చిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంపై కట్ చేసిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సౌత్ ఇండియాలో తొలి టెక్నో హారర్ గా చెబుతున్న ఈ సినిమా, అడుగడుగున థ్రిల్ కలిగించేలానే ఉంది.