టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారని విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల మరో రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం లేదని గోరంట్ల అసంతృప్తికి గురైనట్టు సమాచారం. తనలాంటి సీనియర్ ను కూడా హైకమాడ్ సరిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు.
పార్టీ శ్రేణులు బుజ్జగిస్తే ఆయన వెనక్కి తగ్గుతారా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు టీడీపీ నుంచి బయటకు వస్తే… బీజేపీలో చేరుతారా? లేక వైసీపీ గూటికి చేరుకుంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. గత మూడు, నాలుగు నెలల నుంచి వైసీపీపై కానీ, సీఎం జగన్ పైన కానీ ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.