మాస్ చిత్రాల సృష్టికర్త బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణ ఏకంగా మూడు పాత్రలలో దర్శనం ఇవ్వబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే నమ్మకం అభిమానులలో బలంగా ఉంటుంది.
అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాలయ్య కెరియర్ లో గుర్తిండిపోయే బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుత సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
దీని ముందు బోయపాటి వినయ విదేయ రామాతో డిజాస్టర్ కొట్టిన కూడా బాలయ్య అభిమానులు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా పూర్ణ, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కోసం బోయపాటి చాలా పేర్లు పరిశీలిస్తున్నాడు.మోనార్క్, డేంజర్ అంటూ పేర్లు వినిపించాయి.అయితే ఆ పేర్లు విషయంలో బాలకృష్ణ సంతృప్తికరంగా లేకపోవడంతో బోయపాటి కొత్త పేర్లు కోసం వెతుకుతున్నాడు.ఈ క్రమంలో మరో పేరు తెరపైకి వచ్చింది.
ధర్మ అనే టైటిల్ ఇప్పుడు బోయపాటి బాలకృష్ణని వినిపించాడని తెలుస్తుంది.ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటంతో హీరోయిక్ ఎలివేషన్ ఉండటంతో దీనినే కన్ఫర్మ్ చేయాలని బోయపాటికి సూచించినట్లు టాక్ వినిపిస్తుంది.
త్వరలో దీనిని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ 10 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.