అక్కినేని నాగార్జున తన కుమారులతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. కాకపోతే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన మూవీ తర్వాత సక్సెస్ అందుకోలేకపోయిన ఆయన ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్నసినిమాతో తప్పక హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుండగా, ఈ సినిమా కరోనా వలన కొద్ది రోజులు ఆగింది. ఇటీవల తిరిగి మొదలు పెట్టారు. ఈ రోజు నాగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ది ఘోస్ట్ అనే టైటిల్‌తో చిత్రం తెరకెక్కనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్‌తో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఉన్నారు నాగ్.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
A Powerful Friend ! A Fearful Foe !!
The Ghost stands supreme !!!Here’s the High Octane Motion Poster of #TheGHOST🔥#GhostFirstLook 🗡#HBDKingNagarjuna❤️@iamnagarjuna @PraveenSattaru @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @SVCLLP @nseplofficial pic.twitter.com/OPolGWKZy9
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 29, 2021