బాలయ్య నుంచి బర్త్ డే ట్రీట్‌కి రంగం సిద్ధమైంది.అంతా ఊహించినట్టే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న `అఖండ` చిత్రం నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. బుధవారం ఈ కొత్త లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
`బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్ ముందుగానే స్టార్ట్ అవుతుంది.బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `అఖండ` సినిమా నుంచి కొత్త బర్త్ డే పోస్టర్ని సాయంత్రం 4.36 గంటలకు విడుదల చేయబోతున్నాం` అని ట్వీట్ చేశారు మేకర్స్. `అఖండ బర్త్ డే రోర్` పేరుతో ఈ కొత్త లుక్ విడుదల కాబోతుందని, ఈ సారి మోత మోగాల్సిందేనంటున్నారు యూనిట్. ఇక ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Celebration will start early!!🔥
A new birthday poster will be released Tomorrow at 4:36PM on the occasion of our #Akhanda #NandamuriBalakrishna gari birthday.#AkhandaBirthdayRoar#BoyapatiSreenu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation— Dwaraka Creations (@dwarakacreation) June 8, 2021