ఈ సినిమాకు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో అర్జున పాత్రలో విష్వక్ కనిపించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా కథ సిద్ధం చేయగా.. జయకృష్ణ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్ ఎడిటింగ్ చేయనున్నారు. ఈ సినిమా ఒక లవ్ ఎంటర్టైనర్ అని చిత్ర వర్గాలు తెలిపాయి.
త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి నేడు ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. విష్వక్ తల్లి దుర్గ హీరోపై తొలి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ సహా ఇతర టెక్నిషీయన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. మరోపక్క, విష్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’ చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.