పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 30 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలావుంటే, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. పవర్ ఫుల్ మెసేజ్ తో వకీల్ సాబ్ సినిమా ఆకట్టుకుందని తెలిపింది. అంజలి, అనన్య, నివేదాలకు పవన్ అండగా నిలబడిన తీరు బాగుందంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రకాష్ రాజ్ లేకుంటే సినిమా అసంపూర్తిగా ఉండేదని ట్వీట్ చేసింది. అయితే అనుపమ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకించి చెప్పకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీంతో అనుపమ.. ‘క్షమించండి అబ్బాయిలు.. నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని గ్రహించాను. ఆయనంటే ఎంతో గౌరవం, ప్రేమ’ అంటూ మరో ట్వీట్ ద్వారా తెలిపింది.
So sorry guys… just now I realised” @PawanKalyan gaaaru “ with all respect and love ❤️
— Anupama Parameswaran (@anupamahere) May 1, 2021