సల్మాన్‌ఖాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నిజంగా కాదు వెండితెరపై ఈ ఇద్దరూ తలపడుతున్న చిత్రం ‘అంతిమ్’. ‘ది ఫైనల్ ట్రూత్’ అనేది ఉపశీర్షిక. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయుష్, పోలీస్ అధికారిగా సల్మాన్ నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో తీవ్రమైన చూపులతో ఒకరినొకరు చూసుకుంటున్న ఈ పోస్టర్‌ను కథ ఎలా ఉండనుందో చెప్పేలా ఉంది. నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్‌పై సల్మాన్‌ఖాన్ నిర్మించారు. ‘‘చెడు అంతం మొదలైంది… గణపతి బప్పా మోరియా’అంటూ పోస్టర్‌ను పంచుకుంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. ప్రగ్యా జైశ్వాల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
बुराई के अंत की शुरुआत. गणपति बप्पा मोरया #Antim
#AayushSharma @MahimaMakwana_ @manjrekarmahesh @SKFilmsOfficial @ZeeMusicCompany pic.twitter.com/2dwYDepOQN— Salman Khan (@BeingSalmanKhan) September 7, 2021