తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్లలో శ్యామల ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించి.. యాంకర్‌గా స్థిర పడిన ఆమె.. దాదాపు పదేళ్లుగా పలు రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోందామె. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది శ్యామల. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తరచూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. ఇక, ఈ మధ్య తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు కూడా నిర్వహిస్తూ హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో శ్యామలకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఈ యాంకరమ్మకు టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంధువు అవుతాడట. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ అవుతోంది. అందులో ‘మీకు తెలుసా? యాంకర్ శ్యామల భువనేశ్వర్ కుమార్‌లు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు’ అని అందులో వీళ్లిద్దరి ఫొటోలు జత చేశారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ శ్యామలకు తెలిసేలా ట్యాగ్ చేశాడు. దీంతో దీనిపై ఆమె స్పందించింది. ఈ మేరకు ఆ ఫొటోను షేర్ చేస్తూ ‘ఆ విషయం నాకే తెలీదు.. ఇంక వాళ్లకేం తెలుస్తుంది’ అంటూ సెటైర్ వేసింది. తద్వారా ఇది ఫేక్ వార్త అని తేల్చి పడేసింది. శ్యామల ఇచ్చిన కౌంటర్ స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.