టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పటి వరకు కెరీర్లో ఐదు సినిమాలు చేయగా, వీటిలో ఏ చిత్రం పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆరో చిత్రంగా ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట చిత్రం చేస్తున్నాడు. కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ టైటిల్‌తో పాటు చిత్ర దర్శకుడికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అను ఎమ్మాన్యుయేల్ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
గత రెండు రోజులుగా మూవీకి సంబంధించిన ప్రీ లుక్స్‌తో హల్ చల్ చేసిన చిత్ర బృందం ఈ రోజు రెండు పోస్టర్స్ విడుదల చేయగా, ఇవి రెండు కూడా ఇంటెన్స్గానే ఉన్నాయి. పోస్టర్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం పక్కా రొమాంటిక్ యాంగిల్లో రూపొందుతుందని అర్ధమవుతుంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు.అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
ALLU SIRISH: TITLE + FIRST LOOK POSTERS… On #AlluSirish's birthday today, here's the title of #Sirish6 film: #PremaKadanta… The #Telugu film stars #AlluSirish and #AnuEmmanuel… Directed by Rakesh Sashii… #AlluAravind presentation. #Sirish6FirstLook pic.twitter.com/V3isLWWaxW
— taran adarsh (@taran_adarsh) May 30, 2021