సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను రాసుకున్న కథ ఒక భాగంలో చెప్పడం కుదరదని రెండు భాగాలుగా చెప్పబోతున్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి పాట ఆగస్టు 13న విడుదల కానుంది. దీనికి సంబంధించిన మొదటి అప్డేట్ 10 రోజుల కింద ఇచ్చింది చిత్రయూనిట్. ఇక అప్పటి నుంచి పుష్ప ప్రమోషన్ మొదలైంది. ప్రతిరోజు ఆ పాటకు సంబంధించిన ఒక చిన్న విజువల్ విడుదల చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
ఒక్క పాటకి ఇంత ప్రమోషన్ అవసరమా అని చాలా మంది సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్న కూడా పుష్ప యూనిట్ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. తాము చేయాలనుకున్న పని ఏ మాత్రం పక్కదారి పట్టకుండా చాలా క్లారిటీగా చేస్తున్నారు. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో స్వర పరుస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఒకే రోజు 5 భాషలలో ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా 11 సెకన్లు ఉన్న ఒక చిన్న ప్రోమో విడుదల చేశారు. ఇందులో నోట్లో కత్తి పెట్టుకొని పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు బన్నీ. ఇది చూసి అభిమానులు కూడా అలాగే ఊగిపోతున్నారు.