ఒక వైపున ఎన్టీఆర్ తో కొరటాల .. మరో వైపున మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ప్రాజెక్టులు ఖరారయ్యాయి. బన్నీకి బాగా సన్నిహితుడైన సురేందర్ రెడ్డి అందుబాటులో లేడు. మిగతావాళ్లతో బన్నీ చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బన్నీ ఏ దర్శకుడితో తన సినిమాను ప్లాన్ చేసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. పూర్తిగా కొత్త కథతో .. ‘గజిని 2’ పేరుతో ఈ సినిమా రూపొందవచ్చని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.