అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా రూపొందింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, ఈ పాటికే విడుదల కావలసింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, వెయిట్ చేస్తూ వచ్చారు.
ఈ సినిమాను దసరా రోజుల్లో అక్టోబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా మరో కథానాయికగా అలరించనుంది. ఆమని … మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
గోపీ సుందర్ నుంచి వచ్చిన పాటలకి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి ఆయన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు. ఇక ఇదే రోజున వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Finally! See you soon at the cinemas. October 8th it is 🤗 #MEBOnOct8th#alluaravind @hegdepooja @baskifilmz #PradeeshVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/YqHUJMKqqY
— Akhil Akkineni (@AkhilAkkineni8) August 28, 2021