నందమూరి నట సింహా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ చిత్రాన్నికి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’ టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ‘అఖండ’ మూవీ నుంచి విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.