కొందరికి బుల్లితెర యాడ్స్‌ని చాలా ఇష్టంగా చూస్తుంటారు. సాధారణంగా యాడ్స్ వస్తే ఛానెల్ మారుస్తారు. కొందరు మాత్రం యాడ్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు. మరి ఆ యాడ్స్ కూడా అంత బాగుంటాయి. అప్పుడు ఎయిర్టెల్ యాడ్‌లో సాషా చెట్రిది నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. యాడ్ రక్తి కట్టేలా నటించిన ఈ ముద్దుగుమ్మ చాన్నాళ్లు సైలెంట్‌గా ఉంది. తాజాగా సాషా ప్రభాస్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాషా కీలక పాత్ర పోషిస్తుందట. ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. ఈ సినిమ ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం రావడంతో సాషా పేరు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ‘రాధేశ్యామ్’ కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అయిన నిలుస్తుందా అనేది చూడాలి.