బాలీవుడ్లో సత్తా చాటిన నోరా ఫతేహి బాహుబలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. మనోహరి పాటలో ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌కి దేశం మొత్తం ఫిదా అయింది. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి వంటి తెలుగు చిత్రాలలో ఈ అమ్మడు ఆడి పాడినప్పటికీ, బాహుబలి సినిమాతోనే అందరి దృష్టిలో పడింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా నోరా స్టైలిష్ డ్రెస్‌లో ఎద అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలలో నోరా అందచందాలను చూసి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. ఏమి అందం ఇది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక నోరా బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కథానాయకుడిగా నటిస్తోన్న `సత్యమేవ జయతే -2`లో స్పెషల్ అప్పిరియన్స్ ఇస్తోంది. ఇటీవలే అజయ్ దేవగణ్ నటించిన `భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలోనూ కీలక పాత్ర పోషించింది.