తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే.
Chennai: DMK Chief MK Stalin takes oath as the Chief Minister of Tamil Nadu.
He is being administered the oath by Governor Banwarilal Purohit pic.twitter.com/e8IZT1aNFz
— ANI (@ANI) May 7, 2021