సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు. కాగా, కల్నల్ సంతోష్ బాబు అమరుడైన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండదండగా నిలిచింది. బంజారాహిల్స్ లో ఇంటిస్థలం, రూ.5 కోట్ల ఆర్థికసాయం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 హోదాతో ఉద్యోగం కల్పించారు. గత సంవత్సరం జూన్ 15న గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ బి.సంతోష్ బాబు వీరమరణం పొందడం తెలిసిందే. ఆయన వయసు 37 ఏళ్లు.
#Telangana Municipal/IT Minister #KTR unveiled statue of Col Santosh Babu- who died in #GalwanValley attack last year. The junction,in Suryapet, where the statue was unveiled has been named as Col Santosh Babu Chowrastha. Locals raised slogans for the hero. #GalwanClash #martyr pic.twitter.com/bK4AUKSCwl
— Rishika Sadam (@RishikaSadam) June 15, 2021