దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకు రెండు లిరికల్ వీడియో సాంగులను వదిలారు. ఈ రెండింటికి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
‘నువ్వు అమ్మీ అమ్మీ అంటుంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ .. నా సామీ’ అంటూ ఈ పాట సాగుతోంది. ఇది పక్కా మాస్ బీట్ తో నడిచే పాట. పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 28వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. మాంఛి ఊపుతో సాగుతున్న ఈ పాటకి కూడా రాకెట్ లా దూసుకుపోయే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.