అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కపటధారి’. ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కావలధారి’ సినిమాకు రీమేక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమపై ఆసక్తిని కలిగించాయి. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థీమ్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
థీమ్ ట్రైలర్ చూస్తుంటే.. ఆర్కియాలజీలో ఎప్పుడో జరిగిన హత్య, హంతకుడు ఎవరో తెలియదు. పోలీస్ డిపార్ట్ మెంట్కు అంతుచిక్కని ఆ రహస్యాన్ని ఓ ట్రాఫిక్ పోలీస్ ఎలా చేధించాడనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ మనిషి నిజాన్ని బతికించడానికి సమరం చేయాలి అని చెప్పే మాంటేజ్ సాంగ్ ఈ థీమ్ ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. హంతుకుడిని రహస్యాంగా ఉంచుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈ మూవీకి సైమన్ కె.కింగ్ సంగీతం అందిస్తున్నారు. నాజర్, సంపత్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
#Kapatadhaari #ThemeTrailer is here. Makes an impact & tells what the film is all about 🔥
Link: https://t.co/q0domkvoNq#KapatadhaariFromFeb19
From Team:@isumanth@Directorpradeep @Nanditasweta @simonkking @vennelakishore @bhashyasree @vamsikaka @adityamusic @Dhananjayang pic.twitter.com/nN1XHNXARg
— BARaju (@baraju_SuperHit) February 15, 2021