వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎంజాయ్ చేద్దాం అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. వకీల్‌సాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వకీల్‌సాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అనుమతి ఇవ్వలేమని జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టంచేశారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంతో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్రేకులు పడినట్టయింది.
ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ రిలీజ్ కానుంది. అయితే అంతకంటే ముందుగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగానే మార్చి 29న హోలీ సందర్భంగా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత జరగాల్సి ఉన్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు మగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ముఖ్య అతిథులుగా హాజరు అవుతారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడిలా Vakeel Saab pre-release event కి కరోనా ఆంక్షల రూపంలో అడ్డుకట్ట ఎదురైంది.
సాధారణంగా అయితే తన సినిమాల ప్రమోషన్స్‌పై పవర్ స్టార్ ఎక్కువగా ఫోకస్ చేయరనే పేరుంది కానీ ఈసారి వకీల్ సాబ్ ప్రమోషన్స్ విషయంలో పవన్ కల్యాణ్ కాస్త యాక్టివ్గానే ఉండాలని భావిస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.