ఇటీవల కాలంలో అమెరికా నేవీ పైలెట్లు గగనతలంలో రికార్డు చేసిన అనేక వీడియో ఆధారాలు ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ వీడియోలపై క్షుణ్ణంగా పరిశోధన జరిపిన టాస్క్ ఫోర్స్ కూడా గుర్తు తెలియని విపరీత వస్తువులు ఆకాశంలో సంచరించడంపై ఓ నిర్ధారణకు వచ్చింది. అమితవేగంతో ప్రయాణించిన ఆ వస్తువులు, మానవ మేధకు అందని రీతిలో విన్యాసాలు చేయడం తాలూకు వీడియోలపై పెంటగాన్ సంతృప్తికరంగానే ఉంది. ఈ వీడియోలు నిజమైనవేనని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో, ఫ్లయింగ్ సాసర్లపై దశాబ్దాల తరబడి నెలకొన్న సందేహాలపై అమెరికా రక్షణ రంగ నివేదికతో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీనిపై పెంటగాన్ అధికార ప్రతినిధి స్యూ గాఫ్ మాట్లాడుతూ, అమెరికా గగనతలంలోకి ప్రవేశించే గుర్తించదగిన, గుర్తించలేని వస్తువులను దేన్నైనా తీవ్రంగానే పరిశోధిస్తామని వెల్లడించారు.కాగా, జూన్ 3న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ నివేదికలోని అంశాలను ముందే ఓ కథనంలో వెల్లడించింది. యూఎఫ్ఓలు ఉన్నాయనేందుకు అమెరికా నిఘా వర్గాలు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పేర్కొంది.
Pentagon declassifies three previously leaked videos taken by U.S. Navy pilots that show ‘unidentified aerial phenomena,' which some claim are UFOs pic.twitter.com/Yb7NYulgJ0
— Reuters (@Reuters) April 28, 2020