తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ మీటింగ్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, ఉపాధ్యక్షులుగా బాలగోవింద్రాజ్, వి.ఎల్.శ్రీధర్, ఇన్నారెడ్డి( కో అప్టెడ్), కార్యదర్శిగా కె అనుపమ్రెడ్డి, కోశాధికారిగా విజేందర్రెడ్డి నియమితులయ్యారు. రెండేళ్ల కాలం పాటు (2021-23) నూతన కమిటీ పనిచేయనున్నది.