శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్‌స్టోరి’ మూవీ నుంచి ‘సారంగ దరియా’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సమంత చేతుల మీదుగా వదిలిన ఈ పాట సోషల్ మీడియా దుమ్ముదులుపుతోంది.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్‌స్టోరి’ మూవీ నుంచి ‘సారంగ దరియా’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. “డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్.. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్ చేశావు” అని పేర్కొంటూ ఈ లిరికల్ సాంగ్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత.
‘దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా’ అనే ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. చక్కని తెలంగాణ జానపదానికి సాయిపల్లవి ఎనర్జిటిక్ స్టెప్స్ తోడుకావడం, శేఖర్ కమ్ముల టేకింగ్ ఈ సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్‌కు డాన్స్ కంపోజ్ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా, మంగ్లీ ఆలపించారు. పాటకు తగ్గట్టు పవన్ సీహెచ్ మంచి బీట్తో కూడిన బాణీలు కట్టారు.