స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅయింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. పుష్ప లో బన్నీ ఉరమాస్ లుక్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది.
ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కాని పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేయనున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు సినిమాలు షూటింగ్ ను వాయిదా వేసుకుంటున్నాయి. కానీ సుకుమార్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కనీసం రెండు నెలలు తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక సినిమా విడుదల సమయం ఆగస్టు వరకు ఖచ్చితంగా అంతా సర్థుకుంటుందని వారు నమ్మకంతో ఉన్నారు.