ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను #SoulmateOfPushpa పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో మెప్పించనున్నారు. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో ఆమె డీగ్లామర్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. ఫస్ట్ సింగిల్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
Our fiercest #PushpaRaj's heart melts at the sight of his love ❤️
Meet @iamRashmika as #Srivalli 😍#SoulmateOfPushpa #PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/TFqIGaGGyF
— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021