సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్ సినిమాలకు పెట్టింది పేరు. ‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు వర్మ. ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వర్మ. ‘డి-కంపెనీ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతోన్న వర్మ.. దీనికి హైప్ తీసుకురావడానికి బాగానే ప్రచారం చేస్తున్నారు. కాగా ఆమధ్య వచ్చిన టీజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.తాజాగా వర్మ ‘డి-కంపెనీ’ ట్రైలర్ ను విడుదల చేశారు . మార్చి 26న సినిమా విడుదల కానుంది. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here is D COMPANY trailer my most ambitious project ever .The film is about the underworld SAGA of MUMBAI headed by DAWOOD IBRAHIM ..Produced by SPARK it will be In theatres March 26th https://t.co/ffkAojE8Z2
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2021