తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ప్రతిసారి ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఓ సారి టీమ్‌లో కోవిడ్ వస్తే.. మరోసారి రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను జరపడానికి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ షూటింగ్లో రజనీకాంత్ కూడా పాల్గోన్నారు. ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. కాగా నిన్నటితో రజనీకాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో ఆయన చెన్నైకి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కూడా రజనీకాంత్ రిస్క్ చేసి మరీ హైదరాబాద్‌లో అన్నాత్తే చిత్రం కోసం 35 రోజుల పాటు షూటింగ్లో పాల్గోన్నారు. తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు.
ఇక నయనతారతో పాటు ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తే అన్నాత్తే షూటింగ్ పూర్తవుతుందట. ఈసినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తిసురేష్‌లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించబోతున్నారు.