పవర్‌స్టార్ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌కల్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ప్రీ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం గురువారం ఫస్ట్‌లుక్ షేర్ చేసింది. ట్విటర్ వేదికగా ఈ పోస్టర్‌తోపాటు టైటిల్‌ను రివీల్ చేస్తూ ట్వీట్ పెట్టింది. ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్ ఖరారు చేసింది. సామాజిక కోణంలో బలమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హరీశ్-పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నారు. ఇందులో హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటులుగా ఎవర్నీ ఎంపిక చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
We all need your …
Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro
Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9
— Harish Shankar .S (@harish2you) September 9, 2021