జనసేనాని పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండ్రోజులక్రితం కోవిడ్ పరీక్షలు చేయించుకున్న పవన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. దాంతో, పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అపోలో ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స జరుగుతోంది. పవన్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తోపాటు నిమ్ము చేరడంతో ఆక్సిజన్ అందిస్తూ ప్రత్యేక వైద్య బృందం ట్రీట్మెంట్ అందిస్తోంది. ఇక, పవన్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ ఫామ్‌హౌస్‌లో చికిత్స జరుగుతోంది.
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం… కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/089nooZUlV— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021