యువ సామ్రాట్ నాగచైతన్య ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అనతికాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలు చేస్తూనే నటనకు అధిక ప్రాధాన్యం లభించే సినిమల్లోనూ నటించి మెప్పించాడు. త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు.
ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాను బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. మిస్టర్ ఫర్ఫెక్ట్గా అభిమానులు పిలుచుకునే నటుడు ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’గా రాబోతోంది. ఇందులో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య సైతం ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. లాల్ సింగ్ చద్ధాతో చైతూ హిందీ చిత్రసీమకు పరిచయం కాబోతున్నాడు. గురువారం షూటింగ్లో పాల్గొనగా శుక్రవారం నాడు లాల్ సింగ్ చద్దా మూవీ యూనిట్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక్క ఫొటో వదిలారు. ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్లుగా కనిపించబోతున్నారు.