దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే బాటలో తెలుగులో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని స్లాపించారు. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల రంగంలోకి ఉన్నారు.
ఇంకోవైపు తమిళనాట విజయకాంత్.. ఎండీఎంకే పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగారు. అదే బాటలో కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. తాజాగా తమిళనాట కరుణానిధి మనవడు .. స్టాలిన్ కుమారుడు.. తమిళనాట ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్.,.త్వరలో జరగనున్న తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లోచెన్నెలోని ’చెపాక్’ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 7న తిరుచిరాపల్లిలో జరగనున్న డీఎంకే సమావేశాల్లో ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసే విషయమై అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు తమిళ ఎన్నికల్లో ఖుష్బూ, గౌతమి వంటి వాళ్లు బీజేపీ తరుపున అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. అంతేకాదు మరికొంత మంది సినీ నటులు వేర్వేరు పార్టీల నుంచి అసెంబ్లీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా తమిళనాడు ఎన్నికల బరిలో ఇపుడు సినీ నటులు జాతర జరగనుంది.