యాక్షన్ చిత్రాలతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్‌క్రూజ్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. టామ్ నటించిన ‘టాప్ గన్: మావ్రెక్, ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రాల విడుదల మరింత ఆలస్యం కానుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్రబృందాలు వెల్లడించాయి. ఈ ఏడాది నవంబరు 19న విడుదలకు సిద్ధమైన ‘టాప్ గన్..’ వచ్చే ఏడాది సెప్టెంబరు 30కి వెళ్లిపోయింది. ముందు అనుకున్న ప్రకారం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ వచ్చే ఏడాది మే 27న విడుదల కావాలి. కానీ అదే ఏడాది సెప్టెంబరు 30కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా బాగో లేవు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి భారీ చిత్రాలను విడుదల చేస్తే వసూళ్లు రావు. దీంతో భారీ నష్టాలను మూటకట్టుకోవాల్సి ఉంటుంది’’అని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.