మెక్సికో సిటీలో ఓవర్ పాస్ పాక్షికంగా కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే స్థానికులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లు శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేబట్టారు. ఈ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని కాంప్రెహెన్సివ్ రిస్క్ మేనేజ్ మెంట్ సివిల్ ప్రొటెక్షన్ ఏజన్సీ పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#LoÚltimo Accidente en la Línea 12 del @MetroCDMX. Ocurrió en la estación Olivos, en la alcaldía de Tláhuac. pic.twitter.com/h3v2b5Gwmp
— Animal Político (@Pajaropolitico) May 4, 2021