తాజాగా వకీల్ సాబ్ సినిమాతో ఫ్యాన్స్ ని మరియు సినిమా అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ తెరకెక్కనున్న సినిమాల జాబితా భారీగానే ఉంది. వాటిలో కంటెంట్ వున్న దర్శకుడు క్రిష్ తో పవన్ ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా టైటిల్ “హరి హర వీరమల్లు”. ఫ్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా యంగ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనుంది. అయితే ఇదే సినిమాలో మరో హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తుంది. జాక్వలిన్ ఈ సినిమాలో ఒక రాకుమారి పాత్రా పోషించనున్నట్టు తాజాగా తనే స్వయంగా వెల్లడించింది.