సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో రూపొందుతున్న గంగూభాయ్ కతియావాడి సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీన గంగూభాయ్ కతియావాడి సినిమాను రిలీజ్ చేయనున్నారు. సెక్స్ వర్కర్ పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నది. సెక్స్ వర్కర్ నుంచి ముంబైలో అండర్‌వరల్డ్ డాన్‌గా గంగూభాయ్ ఎదిగిన తీరును భన్సాలీ తెరపై చూపించనున్నారు. అయితే ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని పెన్ స్టూడియోస్ కూడా ప్రకటించింది.