సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 19, 2021
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ రావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఈ వార్త తెలియగానే రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు షాకయ్యారు. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని కవిత తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors
Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏
— KTR (@KTRTRS) April 19, 2021
సీఎం కేసీఆర్ కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలున్నాయని కేటీఆర్ తెలిపారు. అందరి ప్రార్ధనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ట్వీట్ చేశారు. సినీప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగశౌర్య, సుధీర్‌బాబు, గోపిచంద్ మలినేని, ఎస్ ఎస్ థమన్, శ్రీను వైట్ల, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, అసదుద్దీన్ ఒవైసీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఎమ్మెల్యేలు సీతక్క, రాజాసింగ్, డాక్టర్ సంగీతారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ నేతలు పి.మురళీధర్ రావు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కె.లక్ష్మణ్ తదితరులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళన కు గురవుతున్నాను.
వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 19, 2021