పవన్ కళ్యాణ్,రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మలయాళ రీమేక్ చిత్రం భీమ్లా నాయక్.అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతుండగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఒరిజినల్లో ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి. తెలుగులోకి వచ్చే సరికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌నే ఎక్కువ హైలైట్ చేయనున్నారని తెలుస్తోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తే పవన్ డామినేషన్ గట్టిగానే ఉంటుందని అనిపిస్తుందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రానా పాత్రకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇటీవల నెటిజన్స్ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ టైం వచ్చినప్పుడు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని వివరణ ఇచ్చారు.తాజాగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన మరో వీడియో విడుదల చేశారు.బ్రేక్ ఫర్ భీమ్లా నాయక్ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో పవన్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత గన్ పట్టుకొని సోలోగా నడుస్తుండగా, యెగి కమండలం కొమ్ములోంచి చెట్లకు ప్రాణధారలు వదులుతాడు..యోధుడు తుపాకి గొట్టం నుండి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటిని తన భుజాన మోసుకుంటూ ముందుకు సాగుతాడు అని పవన్ ఉద్దేశించి సూక్తులు రాసారు. అయితే ఈ వీడియోని బట్టి చూస్తుంటే పవన్ కొద్ది రోజులు ఈ సినిమాకి బ్రేక్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.