ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్లకు .. టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. “అంత ఇష్టమేందయ్యా .. అంత ఇష్టమేందయ్యా .. నీకు .. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది.
తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చిత్ర ఆలపించారు. పవన్ కల్యాణ్ – నిత్యామీనన్ లపై ఈ పాటను చిత్రీకరించారు. పూర్తి పాటను రేపు ఉదయం 10:09 నిమిషాలకు వదలనున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.