అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా బంగార్రాజు మొదలు కానుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేడు ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.“బంగార్రాజు” ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీంతో పాటు నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి కూడా కన్పించారు.
చిత్రంలో చైతూ సరసన కృతి సనన్ నటించనుంది అర్ధమవుతుంది. ఈ నెల 25 నుండి చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుండగా, ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ స్టూడియోలలో స్వర్గం సెట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో రాము, బంగార్రాజు పాత్రల్లో నటించారు నాగార్జున. చనిపోయిన బంగార్రాజు ఆత్మ రాములో ప్రవేశించిన నేపథ్యంలో ‘సోగ్గాడే చిన్ని నాయానా’ కథనం సాగుతుంది. ఇప్పుడు ‘బంగార్రాజు’ కోసం స్వర్గం సెట్స్ వేయిస్తున్నారంటే… బంగార్రాజు స్వర్గం నుండి వస్తే ఎలా ఉంటుందో ప్రీక్వెల్ లో చూపించనున్నారట.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాగ్, చై, నాగ సుశీల, సీనియర్ రైటర్ సత్యానంద్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, హీరోయిన్ కృతి శెట్టి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. 2022 సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.