గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం భారతీయ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈయన ఆత్మహత్యపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మరవక ముందే.. ఎం.ఎస్.ధోనిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎం.ఎస్.ధోని సినిమాలో నటించిన సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది.
ఈయన చనిపోయే కొన్ని గంటల ముందు తానుఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతేకాదు తన ఆత్మహత్యకు గల కారణాలను ప్రస్తావించాడు.సందీప్ నహార్ .. ఎం.ఎస్.ధోని చిత్రంలో సుశాంత్‌ను క్రికెటర్‌గా ఎంకరేజ్ చేసే పాత్రలో సిక్కు వ్యక్తి పాత్రలో నటించాడు. మరోవైపు ఈయన అక్షయ్ కుమార్.. హీరోగా నటించిన ‘కేసరి’లో ముఖ్యపాత్రలో నటించాడు. ఈయనకు భార్యక కాంచనకు గత కొద్ది రోజులగా వివాదాలున్నాయి. ఈ గొడవలు తగ్గకపోవడమే కాదు.. ఎక్కువ అయ్యాయి. తన భార్య గురించి ఎన్నో ఆరోపణలు చేసిన సందీప్.. తన చావుకు వైఫ్ కారణం కాదని స్పష్టత నిచ్చాడు. ఆత్మహత్య చేసుకున్న వయసు 33 ఏళ్లు. సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.